Wed Mar 18 2026 20:37:21 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అంటే? .. ప్రకటించిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ తన మ్యానిఫేస్టోలో ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటుతున్నా దీనిపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతూ వస్తుంది.
ట్వీట్ చేయడంతో...
కానీ తాజాగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని మంత్రి అనగాని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో మరో సంక్షేమ నిర్ణయమంటూ ఆయన పోస్టు చేయడంతో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఫ్రీబస్సు సౌకర్యం అందుబాటులోకి రానుంది.
Next Story

